అల్ప పీడనం ప్రభావంతో కుప్పం నియోజకవర్గంలో మంగళవారం నుండి ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉంది. చిరు జల్లులు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు సైతం పాఠశాలలకు, కళాశాలలకు వెల్లి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ద్విచక్రవాహనాలలో ప్రయాణించే వారికి చిరు జల్లులతో కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని వాగులు, వంకలు, చెరువులు నీటితో కళకళాడుతొంది.