శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు సెల్ ఫోన్లు, లగేజీ, పాదరక్షలు భద్రపరచుకునేందుకు కౌంటర్ల నిర్వహణకు సంబంధించి టెండర్లు ఖరారు చేశారు. పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం ఏడాదికి 95, 40, 000 చెల్లించేందుకు ముందుకు వచ్చారు. గతంతో పోలిస్తే ఆలయానికి 16. 90 లక్షలు అదనపు ఆదాయం రావడంతో టెండర్‌ను ఖరారు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.