ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ కోరారు. గురువారం రేపల్లెలోని 18 వ వార్డులో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అర్హత ప్రామాణికంగా కుల మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ దే అన్నారు.