ఇంటి నుండి వెళ్లిన ఇద్దరు చిన్నారుల ఆచూకీ గుర్తించి వారిని తల్లిదండ్రులు చెంతకు చేర్చినట్లు రేపల్లె పట్టణ సీఐ విజయచంద్ర తెలిపారు. జార్ఖండ్ కు చెందిన మోహమద్ నసిం అలాం తన రెండవ భార్య షబానా ఆలంతో తన మొదటి భార్య సంతానమైన తేసిఫ్ అలాం, కుమార్తె షాబానా ఖాతూమ్లతో రేపల్లెలో ఉంటున్నాడన్నారు. సవితి తల్లి పెడుతున్న ఇబ్బందులతో చిన్నారులైన తేసిఫ్ అలాం, షబానా ఖాతూమ్లు అక్టోబర్ 29వతేదిన ఇంటి నుంచి వెళ్ళిపోయారన్నారు.