ప్రభుత్వ అసమర్థత, రాక్షస పాలన పై పోరాడుతున్న అయ్యన్నపాత్రుడుని సిఐడి పోలీసులు అర్థరాత్రి దొంగల్లా ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా0 అని టీడీపీ నాయకులూ కిమిడి నాగార్జున తెలియజేసారు.ఆయన మాట్లాడుతూ... ఇది బిసి ల పై జరుగుతున్న దాడి. బిసి లను రాజకీయంగా అణగదొక్కడం కోసం జగన్ రెడ్డి చేస్తున్న వికృత్యచర్యలను టిడిపి కార్యకర్తలు బలంగా తిప్పికొడతారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్నపాత్రుడు గారిని, ఆయన కుమారుడు రాజేష్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలియజేసారు.