ఆ ఇద్దరూ మోడల్స్. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2020 పోటీలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ అమ్మాయిలే అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారే మిస్ అర్జెంటీనా మరియానా వరెలా(26), మిస్ ప్యూర్టో రికో ఫాబియోలా వాలెంటైన్ (22). వీరిద్దరూ తాము పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ అందగత్తెలు అక్టోబర్ 28న వివాహం చేసుకున్నారు.