కర్ణాటకలోని హాసన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉదయగిరి లేఅవుట్లో నివాసం ఉంటున్న మల్లప్ప అనే వ్యక్తి మృతి కరెంట్ షాక్ తో మృతిచెందాడు. తన ఇంటి ముందు ఉన్న కరెంట్ వైర్లలో తన కారు తాళం చిక్కుకుంది. దీంతో ఆ తాళాన్ని తీసేందుకు ఆయన ప్రయత్నించాడు. తాళాన్ని ఇల్లు తుడిచే కర్రతో తీయబోయాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.