రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సిఎం లా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని మాచర్ల టిడిపి ఇంచార్జీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బిసి నేత అయ్యన్న పాత్రుడి ని, కుమారుడిని అరెస్టు చెయ్యడం తనకు దిగ్ర్బాంతి కలిగించిదని అన్నారు. అధికారంలో వచ్చిన నాటినుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని. ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని అన్నారు. నాడు ఇంటి నిర్మాణాలు కూల్చి వేత మొదలు. అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. చింతకాయల విజయ్ పై కేసు విషయంలో సిఐడి విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని అన్నారు. దొంగల్లా పోలీసులు ఇళ్లమీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. వైసిపి సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీ పై బిసి నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు అని బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు.