మరి కాసేపట్లో పెళ్లి. కడుపు నొప్పితో వధువు అల్లాడిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. ఇది తెలిసి పెళ్లికి వచ్చిన బంధువులంతా షాకయ్యారు. నెదర్లాండ్స్ లోని డోడ్రెచ్ట్లో జరిగిందీ సంఘటన. నికోల్, మార్క్ లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చింది. డెలివరీకి ఇంకా ఐదు వారాలు గడువు ఉందని, ఆ లోపే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అంతలోనే బిడ్డ జన్మించడం విశేషం.