గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ప్రకాశం పంతులు నగర్ కు చెందిన ఏడుకొండలు, లక్ష్మీతిరుపతమ్మ భార్యాభర్తలు. తిరుపతయ్య అనే యువకుడు లక్ష్మీతిరుపతమ్మను కొంతకాలంగా వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి లక్ష్మీతిరుపతమ్మతో తిరుపతయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తిరుపతయ్యతో ఏడుకొండలు గొడవపడగా, తిరుపతయ్య సీసాతో ఏడుకొండలు తలపై కొట్టాడు. ఈ ఘటనలతో మనస్తాపానికి గురైన లక్ష్మీతిరుపతమ్మ సూసైడ్ చేసుకుంది.