వివేకానందరెడ్డి హత్య కు సంబంధించిన అసలు సూత్రదారులపై షర్మిల సీబీఐ కి ఇచ్చిన వాంగ్మూలం పై ప్రముఖ దినపత్రికలలో వచ్చినటువంటి విషయాలు పక్కదోవ పట్టించాలని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు వారి కుమారుని రాజేష్ లను అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ పై తీవ్రం గా ఖండిస్తున్నామని టిడిపి జిల్లా నాయకులు జగన్ మోహన్ రాజు గురువారం రాయచోట్ల ఏర్పాటుచేసిన సమావేశంలో పేర్కొన్నారు. టీడీపీకి అండగా ఉన్నారనే బీసీ నేతలపై జగన్ రెడ్డి కక్ష్య సాధింపులు చేస్తున్నారు.
బలమైన బీసీ నేతను దైర్యంగా ఎదుర్కోలేక చింతకాయల అయ్యన్నపాత్రుడుని అర్ధరాత్రి అరెస్టు చేసి , భయానక వాతావరణం సృష్టించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు కూడా విలువలు లేకుండా అధికార పార్టీకే మద్దతుగా నిలుస్తున్నారు. అయ్యన్నపాత్రుడు అరెస్టు విషయంలో ప్రభుత్వం నిజాయితీ ఏంటో అర్థం అవుతుంది. గత మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపై ఏదో ఒక విధంగా వేధింపులకు గురిచేస్తున్నారనీ తెలియపరిచారు.