ఏపీలోని చిత్తూరు జిల్లా మల్లేరులో జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె భర్తే హంతకుడని విచారణలో తేలింది. యాదగిరి, రోజా దంపతులకు 2019లో పెళ్లైంది. రోజాకు పుట్టింటివారు ఇచ్చిన బంగారు నగలను యాదగిరి అమ్మేశాడు. దీంతో రోజా అతనితో నిత్యం గొడవపడేది. అప్పటినుంచి భర్త, అత్తమామలు రోజాను వేధించారు. ఆదివారం దంపతుల మధ్య మళ్లీ గొడవైంది. దీంతో యాదగిరి రేషన్ కట్టర్తో రోజాను గొంతునరికి చంపాడు.