శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య పరీక్షల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన గర్భవతులకు వైద్య పరీక్షల అనంతరం దివ్య ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. ఈ సందర్బంగా శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య పరీక్షల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన గర్భవతులకు వైద్య పరీక్షల నిమిత్తం విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.