రైతులు తమ పంటలను కోత ప్రయోగాలు చేసుకోవాలని, దీంతో పంటల బీమాలో ప్రధాన పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టి కల్ సీనియర్ అధికారి మొహ్మద్ వకార్ హసన్ అన్నారు. గురువారం ఎర్రగొండపాలెం మండలంలోని గంగాపాలెంలో చేకూరి ఆంజనేయులు పత్తి పొలంలో పంట కోత ప్రయోగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 10 స్క్వేయర్ ప్లాట్ లో కోసిన పత్తి 4 కిలోల దిగుబడి వచ్చిందని, ప్రతి పంటకు కోత ప్రయోగం చేస్తామన్నారు. గ్రామ ఉద్యాన సహాయకుడు బి. నా గేంద్రకుమార్ పాల్గొన్నారు.