ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టణంలో నమస్తే మార్కాపురం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 12:46 PM

మార్కాపురం పట్టణంలోని 22వ వార్డులో శుక్రవారం ఉదయం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి నమస్తే మార్కాపురం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలతో మాట్లాడుతూ, స్థానికంగా ఉండే సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని , ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట విషయాన్ని ఈ సందర్భంగా కందుల ఆరోపించారు. మురుగునీరు పోయే దారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న, పుర పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదని కందుల అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున, పట్టణ పార్టీ అధ్యక్షులు మౌలాలి, వార్డు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com