ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ ఏటీఎంను ను అందుబాటులోకి తెచ్చిందని బ్యాంక్ జనరల్ మేనేజర్ రాఘవయ్య చెప్పారు. చీరాల బ్యాంక్ శాఖ కు కేటాయించిన నూతన మొబైల్ ఏటీఎం వ్యాన్ ను గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.
ఇక పై ఈ మొబైల్ ఏటీఎం సేవలను చీరాలలో విస్తృత పరుస్తామన్నారు. ఖాతాదారులు ఏటీఎం సెంటర్లను వెతుక్కునే పని లేకుండా పట్టణంలోని అన్ని కూడళ్ళలో మొబైల్ ఏటీఎం సిద్ధంగా ఉంటుందన్నారు. ఖాతాదారులు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ చీరాల శాఖ మేనేజర్ వాసుదేవ్ సింగ్ , రీజనల్ ఆఫీస్ మేనేజర్ విశ్వేశ్వరరావు, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.