వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన దేవరకొండ కావ్య, దేవరకొండ జ్యోతి స్రవంతి అనే ఇద్దరు యువతులు సోమవారం నుండి కనిపించకుండా పోగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఎస్ఐ సురేష్ మూడురోజుల్లోనే వారి జాడ కనిపెట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి మొబైల్ ఫోన్లు ట్రాక్ చేసి ఎక్కడున్నదీ గుర్తించి వారిని తీసుకొచ్చి శుక్రవారం వారి తల్లులకు సురక్షితంగా అప్పగించారు. కాగా చిన్నపాటి కుటుంబ సమస్యల కారణంగా వారి ఇంటి నుండి వెళ్లిపోయారని, తగిన కౌన్సెలింగ్ ఇచ్చి వారిని ఇళ్లకు పంపామని ఎస్ఐ సురేష్ చెప్పారు.