ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో బుధవారం అర్ధరాత్రి బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు ఓ నగల వ్యాపారిపై కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ తగలకపోవడంతో ఆ వ్యాపారి తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యాపారి కారుకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.