గుంటూరు జిల్లాలో స్పెషల్ సమ్మరి రివిజన్ 2023 ఓటర్ల జాబితా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. జెండర్ శాతం హెచ్చుతగ్గులున్న నియోజక వర్గాలలోని ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నవారు ఓటు హక్కు నమోదు చేసుకునేలా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.