సత్తెనపల్లి కి చెందిన మద్ది వెంకట నాగ హరీష్ (20) కొద్ది రోజుల నుండి మానసిక సమస్య బారిన పడ్డాడు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. మనోవేదనకు గురైన అతను బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. భీమవరం రోడ్డులోని పొలాల వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.