తాడేపల్లిలో చేయికోసుకున్న మహిళకు న్యాయం చేయాలని సీఎంఓ అధికారులతో చర్చించినట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మాట్లాడుతూ మానవత్వం గురించి చంద్రబాబు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. యాసిడ్ బాధితురాలికి ప్రభుత్వం ఎందుకు సాయం అందించాలని వాదించిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు.