ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన పెద్దపంజాణి మండలం ఇటుక నెల్లూరులో జరిగింది. దామోదర్ కి అనురాధతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. కాగా నగలను ప్రియుడు గంగరాజుకి ఇవ్వగా భర్త నగలు అడగడంతో హత్యకు ప్లాన్ వేసింది. దీపావళికి ఇద్దరూ అత్తింటికి వెళ్లివస్తుండగా గంగరాజు దామోదరం కళ్లలో కారం కొట్టి కత్తితో దాడి చేశాడు. దొంగలు తన భర్తను హతమార్చి నగలు దోచుకెళ్లారంటూ కథ అల్లింది. అనుమానంతో విచారణ చేయగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి