నవంబర్ 20 నుండి ఫిఫా వరల్డ్ కల్ మొదలుకానుండడంతో ఫుట్ బాల్ ఫీవర్ మొదలైంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని పల్లవూర్ కు చెందిన యువకులు అర్జెంటీనా ఫ్యాన్స్ అసోసియేషన్ గా ఏర్పడ్డారు. ఫిఫా వరల్డ్ కప్ లో తమ ఫేవరేట్ టీం, ఫేవరేట్ ఆటగాడికి మద్దతుగా కురున్ గట్టు కడవు నది మధ్యలో 30 అడుగుల మెస్సీ కటౌట్ పెట్టారు. ఫిఫా వరల్డ్ కప్ ఈవెంట్ ని మరింత స్పెషల్ గా మార్చేందుకే మెస్సీ కటౌట్ పెట్టినట్లు వారు తెలిపారు.