ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేపర్ మిల్లుల ప్రతినిధులతో గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు. సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర కల్పనపై చర్చించారు. ప్రస్తుతం చెల్లిస్తున్న ధరపై టన్నుకు కనీసం రూ.200 పెంచేందుకు పేపర్ మిల్లుల యాజమాన్యాలు అంగీకరించాయి. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకే డబ్బుల్ని చెల్లించాలని కంపెనీల ప్రతినిధులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.