పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి టీమిండియాపై అక్కసు వెళ్లగక్కాడు. పాక్ సెమీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లడంతో ఐసీసీపై శుక్రవారం ఆరోపణలు చేశాడు. సెమీ ఫైనల్లో భారత్‌ను ఖచ్చితంగా ఆడించాలని ఐసీసీ బలంగా కోరుకుంటోందని పేర్కొన్నాడు. అందుకే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. వర్షం ఆగాక ఔట్ ఫీల్డ్ బాగోకపోయినా మ్యాచ్ జరిపించారన్నారు.