గుంటూరు, ప్రకాశం, కృష్ణాజిల్లాలకు చెందిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు, ఆయా సంస్థల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ తెలిపారు. ఉదయం 10: 30 గంటల నుంచి 12: 30 వరకు నేరుగా సంప్రదించవచ్చునని, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు ఆన్లైన్ వివరాలు అందివ్వ వచ్చన్నారు. తమ సమస్యలను 9494657469 వాట్సాప్ ద్వారా కూడా పంపవచ్చుని తెలిపారు.