చిలకలూరిపేట మండలంలోని పోతవరం గ్రామంలో బాలిక, యువకుడు అదృశ్యమైనట్లు గ్రామీణ ఎస్సై రాజేష్ తెలిపారు. గ్రామానికి చెందిన ఘంటసాల జానీ భాష (21) గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన బాలిక కూడా అదృశ్యమైనట్లు ఆమె అమ్మమ్మ ఫిర్యాదు చేసింది. శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.