గ్రామ పంచాయతీలకు విడుదలైన 14, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో విద్యుత్ బిల్లులకు జమ చేయడం మంచిది కాదని, వెంటనే ఆ నిధులను గ్రామ సర్పంచులే వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని కోరుతూ ఎంపీ గోరంట్ల మాధవవ్ని మండలంలోని గ్రామ సర్పంచులు కోరారు. ఎంపీ చిలమత్తూరు మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా సర్పంచులు వినతి పత్రాన్ని అందించారు. సర్పంచులు తిర మలేష్ గౌడ్, మురళీమోహన్, లక్ష్మీపతిరెడ్డి, నంద్య తదితరలు ఉన్నారు.