నవరత్నాలు పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా 90 రోజుల పథకంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల మంజూరుకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహశీల్దార్ బి. రాము స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన పేదలు సచివాలయాలలో దరఖాస్తులు ఇచ్చారన్నారు. వాటిని పరిశీలించి వారికి 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అందులో భాగంగా స్థలాలు పరిశీలన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కెఎండి. ఇస్సాక్, సర్వేయర్ మరెప్ప, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మురళి తదిత రులు పాల్గొన్నారు.