నాదెండ్ల మండలంలోని గొరిజవోలు గ్రామంలో రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్న డీలర్ పై కేసు నమోదయింది. గ్రామానికి చెందిన కె. భాగ్యలక్ష్మి గ్రామంలో రేషన్ డిపో నడుపుతున్నారు. శుక్రవారం విజిలెన్స్ అధికారులు డిపోలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 25 బస్తాల రేషన్ బియ్యం తేడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసును విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ ఎ. భాస్కర్ చీటింగ్ కేసు నమోదు చేశారు.