గుంతకల్లు పట్టణంలోని ప్రజలు, వ్యాపారస్తులు పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచిం చారు. ఆదివారం పట్టణంలోని ప్రధాన రహదారిలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను కమీ షనర్ పరిశీలించారు. అదే విధంగా ట్రావలర్స్ బంగ్లా ఏరియాలో ఇంజ నీరింగ్ మార్జిన్ పనులను పరిశీ లించారు. అనంతరం మెయిన్ రోడ్డు లోని వైఎస్ఆర్ కూడలిలో ప్రధాన కాలువ నిర్మాణ పనులు పరిశీలించారు. ఆయనతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.