తిరుమల శ్రీవారి మొత్తం ఆస్తుల విలువను టీటీడీ శనివారం వెల్లడించింది. శ్రీవారి ఆస్తుల విలువ రూ.2.50 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. 1933 తర్వాత తొలిసారిగా శ్రీవారి ఆస్తుల విలువ తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేశారు. బ్యాంకుల్లో 10.25 తులాల బంగారు డిపాజిట్లు, 2.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.16 వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 960 ఆస్తులున్నట్లు టీటీడీ వెల్లడించింది.