ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాధారణ ప్రయాణికుడిలా మాజీ ఉపరాష్ట్రపతి

national |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 11:19 AM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒంగోలు రైల్వే స్టేషన్ లో సాధారణ ప్రయాణికుడిలా వేచి చూస్తూ, వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన వారితో ముచ్చటించారు. ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్యటనను ముగించుకొని పాట్నా-బెంగళూరు రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది. రైలు ఉదయం 6.15 గంటలకు కాగా ఆలస్యంగా వస్తున్నట్లు సమాచారం అందటంతో మూడో నంబరు ప్లాట్ ఫాంపై వేచి చూస్తూ, ఫోటోలకు పోజులిస్తూ గడిపారు. అనంతరం చెన్నై వెళ్లిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com