శ్రీకాళహస్తీశ్వరాలయంపై భాగంలో ఏర్పడుతున్న లీకేజీ నివారణకు ఐఐటీ నిపుణులు ఆదివారం టెస్టింగ్ పనులు చేపట్టారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అభ్యర్థన మేరకు ఇటీవల ఐఐటీ నిపుణులు ఆలయంలో లీకేజీలను పరిశీలించారు. ప్రస్తుతం తొలి టెస్టింగ్ ప్రక్రియ చేయడంతో తదుపరి ప్రక్రియలను చేపట్టనున్నారు.