బి. కొత్తకోటలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ లో సందర్శకుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం పర్యాటకులతో కొండ కిటకిటలాడింది. దూర ప్రాంతాలు నుంచి వచ్చిన సందర్శకులు కొండపై నుంచి ప్రకృతి అందాలను వీక్షించారు. అటవీ, పర్యాటక శాఖల ప్రాంగణాల్లో చిన్నారులు ఆట, పాటలతో గడుపుతూ కన్పించారు. పచ్చదనం పరుచుకున్న ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసుకోవడంతో పాటు సెల్ఫీలు తీసుకోని నిక్షిప్తం చేశారు.