ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు పెరగడం, పొట్ట చుట్టుకొవ్వు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పలు చిట్కాలు పాటించి ఈ పొట్టను తగ్గించుకోవచ్చు. రాత్రి 7 గంటలలోపు భోజనం చేయడం, రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం ద్వారా పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా కూడా పొట్ట నుండి ఉపశమనం పొందవచ్చు.