ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడ పాతరాజరాజేశ్వరిపేటలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికంగా నివసించే ఏడేళ్ల చిన్నారి ఒకటో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్న ఆమెను సమీపంలో ఉండే హఫీజ్ (45) అనే వ్యక్తి బిస్కెటు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఏడుపు విన్న స్థానికులు హఫీజ్ ఇంటికి వెళ్లి ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. నిందితుణ్ని దిశ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.