తిరుపతిలోని టీపీపీఎం స్కూలులో ఆదివారం ఏపీసీపీఎస్ ఉద్యోగుల జిల్లా సమావేశం నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రేగంటి దేవానంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులతో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవఅధ్యక్షుడిగా మండ్యం శివకుమార్ , అధ్యక్షుడిగా రేగంటి దేవానంద్, సహ అధ్యక్షుడిగా యువకిశోర్, ఉపాధ్యక్షులుగా చెంగల్రాయులు, జి.భారతి, పి.రోహిణి, కె.సతీష్ , సి.రాజశేఖర్, ప్రధానకార్యదర్శిగా పీవీ సుబ్బారెడ్డి, అదనపు కార్యదర్శిగా ఎండీ సలీమ్, ఆర్థిక కార్యదర్శిగా పి.వెంకటయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎల్.సుదర్శన్‌రెడ్డి , ప్రకాష్ రావు , ఎం.చంద్రశేఖర్, అజ్మతుల్లా, మహిళాప్రతినిధిగా రెడ్డిరాణిలతోపాటు ఈసీ సభ్యులుగా ఒ.మళ్లీశ్వరయ్య , ఎం.మహేష్ , యాదగిరిరావు , వెంకటలక్ష్మి లను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ ఏపీలో పాతపెన్షన్ అమలుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.