యువతను మోసగించిన సీఎం జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో సాగనంపేందుకు యువత సిద్ధం కావాలని తెలుగుయువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు అన్నారు. నౌగాంలో టీడీపీ మండల అధ్యక్షుడు పినకాన అజయ్ కుమార్ అధ్యక్షతన ఆదివారం తెలుగుయువత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసునాయుడు మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించడం ద్వారా 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గ్రామస్థాయిలో సీనియర్లను కలుపుకొని వెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల అధ్యక్షులు బగాది శేషు, జీరు భీమారావు, బోయిన రమేష్‌కుమార్ మాట్లాడుతూ.. యువత చైతన్యవంతంగా వ్యవహరించి అభివృద్ధికి చిరునామా అయిన టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పోలాకి చంద్రశేఖర్, మళ్ల బాలకృష్ణ, తూలుగు ఉమామహేశ్వరరావు, బెండి గిరిబాబు, హేమంత్, ఎం.సింహాచలం, ఎం.తిరుపతిరావు, జి.మన్మఽథరావు, ప్రవీణ్, ఎస్.జానకిరాం, కృష్ణారావు, పున్నయ్య, లవకుమార్, అరుణకుమార్, బి. బాలకృష్ణ, ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.