మార్కాపురం, స్థానిక మార్కండేశ్వస్వామి దేవస్థానంలో శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వరుని కల్యాణం ఆదివారం వైభవం గా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు ఆంజనేయశర్మ వేద మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోత్తం గా కల్యాణం నిర్వహించారు. ఉభయదాతలుగా దేవస్థానం చైర్మన్ వాలిచర్ల కేశవరావు, శైలజ దంపతులు, త్రిపురాంతకేశ్వస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు అనగా వెంకట సుబ్బా రావు, సుబ్బమ్మలు వ్యవహరించారు. కల్యాణం అనంతరం పట్టణంలోని బ్రాహ్మణులకు కార్తీక సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో దేవ స్థానం మాజీ చైర్మన్ రెంటచింతల మధు, ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, బ్రాహ్మణ సంఘం నాయకులు గోపాలుని హరిహరరావు, నాగరాజు, దక్షిణామూర్తి, పాల్గొన్నారు.