సమస్యలపై కలెక్టర్ స్పందించనప్పుడు "స్పందన" కార్యక్రమం ఎందుకని... తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో భూసమస్యపై గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ... మరోసారి స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదని కలెక్టర్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ ను అడిగారు. వైకాపా ఎమ్మెల్యేలు ఫిర్యాదులపై వెంటనే స్పందించే అధికారులు... తమ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. సరే ఇక వెళ్లండని కలెక్టర్ అనడంతో... ప్రభాకర్ రెడ్డి తన చేతిలోని కాగితాలను బల్లపై విసిరేశారు. ఇది పద్ధతి కాదంటూ మండిపడ్డారు.