మెక్సికోలోని ఓ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ సిబ్బందిపై ఓ యువతి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబర్ 1న ఈ ఘటన జరిగింది. ఫ్లైట్ మిస్ అయిందని ఓ మహిళ ఎయిర్‌పోర్టులో హంగామా సృష్టించింది. గట్టిగా కేకలు వేస్తూ, తన లగేజీని ఇతర ప్రయాణికులపై విసిరేసింది. అడ్డుకోబోయిన విమానాశ్రయ సిబ్బంది ముఖంపై పిడిగుద్దులు గుద్దింది. ఈ వీడియోను Hans Solo అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ప్రయాణికురాలి ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు రావడమే ఆమె తప్పు అని వ్యాఖ్యానిస్తున్నారు.