కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ లక్ష్మణ్ రావు జర్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'హిందూ' పదం పర్షియాకు చెందినదని, 'హిందూ' అంటే పర్షియన్ భాషలో 'భయానకం' అని, ఈ పదంతో భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బెళగావిలో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన వ్యాఖ్యలను సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా పార్టీ తరఫున ఖండించారు. హిందూ అనేది ఓ జీవన విధానం అని, నాగరికతకు వాస్తవరూపం అని తెలిపారు.