హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సహా 26 మంది సీనియర్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జైరాం ఠాకూర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాన్ సింగ్ సమక్షంలో సోమవారం ఈ చేరికలు జరిగాయి. పార్టీ మారిన వారిలో ధర్మపాల్ ఠాకూర్, ఆకాష్ సైని, రజన్ ఠాకూర్, అమిత్ మిశ్రా, రాహుల్ నగి తదితరులు ఉన్నారు.