యూపీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బులంద్‌షహర్‌లోని ఓ నగల దుకాణంలోకి ఇద్దరు దుండగులు శుక్రవారం తుపాకీలతో ప్రవేశించారు. యజమానిపై రెండు సార్లు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆపై నగదు, బంగారంతో పరారయ్యారు. కాల్పుల్లో గాయపడిన దుకాణం యజమానిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. దోపిడీ దొంగల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.