అనుమానాస్పద స్థితిలో ఒక వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన ఘటన మండ వల్లి మండలం అప్పాపురంలో సోమవారం చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. గ్రామానికే చెందిన అరిగి వెంకటరత్నమ్మ (70) పక్షవాతంతో బాధప డుతున్న కుమారుడితో కలసి ఉంటున్నారు. సోమవారం ఉదయం స్థానిక పంచాయతీ ఊర చెరువులో ఆమె శవమై కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. కోడలు శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు అను మానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు.