మధ్యప్రదేశ్ లోని రేవా బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా మద్యం తాగాలని, గుట్కా నమలాలని, థిన్నర్ పీల్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నీటి సంరక్షణపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని, కాబట్టి వాటిని రక్షించాలని పేర్కొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మత్తు పదార్థాలను తినండి కానీ నీళ్ల ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకోండి అని వ్యాఖ్యానించారు.