సిఎం జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో వైకాపా ప్రభుత్వం ప్రతి గడపగడపకు సంక్షేమ ఫలాలు అందిస్తోందని నియోజకవర్గ ఎమ్మెల్యే వై. వెంకట రామిరెడ్డి అన్నారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలోని 36వ వార్డులో వార్డు కౌన్సిలర్ కుమారి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి పాల్గొని గడపగడపకు వెళ్లి ప్రజల సమస్య లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, అనంతపురం అర్బన్ నియోజకవర్గం వైకాపా పరిశీలకుడు రామలింగప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల రామాంజనేయులు కౌన్సిలర్లు, సచివాలయ కార్యదర్శిలు, వాలంటీర్లు పాల్గొన్నారు.