కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని మార్కెట్ యార్డ్ నందు 50 లక్షల పైగా వ్యయంతో నిర్మిస్తున్న డిజిటల్ గ్రంథాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వై వి భద్రారెడ్డి సహకారంతో డిజిటల్ గ్రంథాలయాన్ని అభివృద్ధి పథంలో ఉంచే విధంగా కృషి చేస్తానని సర్పంచ్ బొనిగల ఎలిసమ్మ తెలియజేశారు. పరిజ్ఞానాన్ని పెంచే పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని ఆమె పేర్కొన్నారు.