ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో నేడు అనగా ఈనెల 8వ తేదీ మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారని చెప్పారు. కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.